ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలోని అనంతసాగరం మండలంలో సోమశిల జలాశయం పంట భూములను సస్యశ్యామలం చేయడంతోపాటు సందర్శకులకు ఆహ్లాదాన్ని కూడా కలిగిస్తోంది. నెల్లూరు జిల్లాలో ప్రధాన వేసవి విడిది కేంద్రంగా ఇది గుర్తింపు పొందింది. కడప జిల్లాల పరిధిలో సాగునీటి కోసం ఉద్దేశించిన ఈ జలాశయాన్ని రెండు కొండల మధ్య నిర్మించారు. జలాశయంలోని నీటి నిల్వలుచుట్టూ విస్తరించిన నల్లమల అడవుల పచ్చదనంతో ఏడాది పొడవునా వాతావరణం చల్లగా ఉంటుంది. ఇక్కడ సోమేశ్వరస్వామి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలు కూడా భక్తులను ఆకర్షిస్తున్నాయి.
ఈ రిజర్వాయర్ నెల్లూరు పట్టణానికి 80 కి.మీ. దూరంలో ఉంది. నెల్లూరు నుంచి ఆర్టీసీ బస్సులు ఉంటాయి.